సీఏఏ నిరసనల దృష్ట్యా హిందూ దేవతల చిత్రాలను కాల్చారా ?
By రాణి Published on 3 Jan 2020 12:40 PM GMTదేశవ్యాప్తంగా సిఏఏ వ్యతిరేకంగా నిరసనలు వెలువెత్తుతున్న వేళలో, ఎన్నో తప్పుడు ప్రచారాలతో చిత్రాలు, వీడియోలు సొషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అలాంటిదే ఈ వీడియో, ఇందులో కొంతమంది యువకులు నినాదాలు చేస్తూ, హిందూ దేవతల చిత్రాలకు నిప్పు పెట్టి కాల్చడం మనం చూడవచ్చు.
బీజేపీ అధికారిక ప్రతినిధి సంబిత్ పాత్ర కూడా ఈ వీడియో ను ట్విట్టర్ లో షేర్ చేశారు. "హిందూ దేవతల చిత్రాలను కాల్చే హక్కు వారికి ఎవరు ఇచ్చారు? ఎటువంటి నిరసన అయినా హిందూ వ్యతిరేక నీరసన ఎలా కాగలదు? కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు ఇటువంటీ వాటిని సమర్ధిస్తున్నాయా ?" అంటూ ఆయన ట్వీట్ చేశారు.
సిఏఏ నిరసనల్లో హిందూ దేవతల చిత్రాలను కాలుస్తూన్నారు. ప్రభుత్వం సిఏఏ గురించి ఎంతగా వివరించినా, కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నిరసనలన్నీ హిందూ వ్యతిరకత తో జరుగుతున్నావే" అంటూ ఇంకో ట్విట్టర్ వినియోగదారుడు ట్వీట్ చేశాడు.
అంబేద్కర్ పేరును అరుస్తూ బంగళూరులో ఇది జరిగిందంటూ మరోకరు ట్విట్టర్ లో షేర్ చేశారు.
ఈ వీడియో ఫేస్ బుక్ లో కూడా చాలమంది షేర్ చేసుకున్నారు.
నిజ నిర్ధారణ:
ఫేస్ బుక్ లో 'హిందూ దేవతలను అగౌరవపరుస్తున్న నిరసనకారులు’ అంటూ ఆంగ్లంలో వెతకగా, సెప్టెంబర్ 2018లో యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియో దొరికింది. 'ఇన్ హిందీ అనాలిసిస్’ అనే యూట్యూబ్ చానల్ లో 'భీం ఆర్మీ యాక్టివిస్ట్స్ డిస్ రెస్పెక్ట్ హిందూ గాడ్స్ ' అనే టైటిల్ లో ఈ విడియో సెప్టెంబర్ 3, 2018 రోజున అప్లోడ్ చేయబడింది.
ఫేస్ బుక్ లో కూడా ఈ వీడియో ఆగస్ట్ 2018 లో అప్లోడ్ చేసి ఉండడం మనం చూడవచ్చు. దీని ప్రకారం ఈ ఉదంతం అశోక్ పురం, మైసూరు లో జరిగినట్టు తెలుస్తోంది.
హిందూ దేవతల చిత్రాలను కాల్చే ఈ వీడియో నిజమైనదే అయినా, ఈ ఉదంతం సిఏఏ నిరసనల దృష్ట్యా జరిగిందనడం తప్పు. ఇది జరిగి సంవత్సరానికి పైన గడిచింది. ఇందులో ఉన్నది సిఏఏ నిరసనకారులు కాదు, భీం ఆర్మీ కార్యకర్తలు.