సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్‌బుక్’ తాజాగా తన కస్టమర్ల కోసం కొత్త‌ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా పేమెంట్ సిస్టమ్‌ను లాంచ్ చేసింది. దీనికి సంబందించి ఫేస్‌బుక్, మెసెంజర్ ల‌లో ఈ పేమెంట్స్ సిస్ట‌మ్ పనిచేస్తోంది. దీని పేరు ‘ఫేస్‌బుక్ పే’. అంటే గూగుల్ పే, పోన్‌పే లాగా.. ఫేస్‌బుక్ తో కూడా డబ్బులు పంపొచ్చు.

అయితే.. ‘ఫేస్‌బుక్ పే’ సర్వీసు ఈ వారం నుండే ఫేస్‌బుక్, మెసేంజర్ యాప్స్‌లలో అందుబాటులోకి రానున్నాయి. రానున్న కాలంలో ‘ఫేస్‌బుక్ పే’ సర్వీసులను మ‌రిన్ని దేశాల్లోనూ అందుబాటులోకి తీసుకువస్తామని ఫేస్‌బుక్ వైస్ ప్రెసిడెంట్ డెబోరాహ్ లియు తెలిపారు. తొలుత ఈ సర్వీసులు అమెరికాలో కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి.

ఇక‌పోతే.. ఫేస్‌బుక్, మెసెంజర్ యాప్స్‌లో ఫేస్‌బుక్ పే సేవలు పొందాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘ఫేస్‌బుక్ పే’ పేమెంట్ మెథడ్‌ను యాడ్ చేసుకోవాలి. ‘ఫేస్‌బుక్ పే’ సర్వీసులకు పిన్ ను సెట్ చేసుకొని య‌థేచ్చ‌గా ఈ స‌ర్వీసుల‌ను కొన‌సాగించ‌వ‌చ్చు. దీని ద్వారా ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో కొనుగోళ్లు కూడా చేసుకోవ‌చ్చు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.