జియోపై కన్నేసిన ఫేసుబుక్‌.. నిజమేనా.!

By అంజి  Published on  26 March 2020 3:03 AM GMT
జియోపై కన్నేసిన ఫేసుబుక్‌.. నిజమేనా.!

ఢిల్లీ: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేసుబుక్‌ కన్ను ఇప్పుడు రిలయన్స్‌ జియో మీద పడింది. ఇండియన్‌ డిజిటల్‌ మార్కెట్‌ పరిధిని పెంచుకునేందుకు ఫేసుబుక్‌ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియోలో 10 శాతం వాటా కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.

ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనం ప్రకారం.. 60 బిలియన్‌ డాలర్ల విలువైన జియోలో 10 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. అయితే ఈ విషయంపై అటు ఫేస్‌బుక్‌ గానీ, ఇటు రిలయన్స్‌ జియోగా స్పందించలేదు. ఈ ఒప్పందంపై కరనా లాక్‌డౌన్‌ ప్రభావం పడవచ్చని ఓ ఇంటర్నేషనల్‌ మీడియా పేర్కొంది. ట్రావెల్‌ బ్యాన్‌ కొనసాగుతున్నందున ఈ చర్చలు ప్రస్తుతానికి ఆగిపోయాయని తెలిసింది. ఈ విషయంపై ఓ రిలయన్స్‌ ప్రతినిధిని ప్రశ్నించగా.. అతడు సమాధానం చెప్పేందుకు నిరాకరించడట.

Also Read: తెలంగాణలో 41, ఏపీలో 10 కరోనా కేసులు

రిలయన్స్‌కు సంబంధించిన డిజిటల్‌ కార్యక్రమాలు, అన్ని యాప్‌లను ఒక కొత్త అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయబోతున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇదివరకు ప్రకటించింది.

2020 మార్చి 31 వరకు జియోను రుణరహిత సంస్థగా నిలపాలని రిలయన్స్‌ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. భారత్‌లో యూఎస్‌ టెక్‌ గ్రూపులతో పోటీపడగల ఏకైక సంస్థగా రిలయన్స్‌ అవతరించింది. ఇటు గూగుల్‌ కూడా రిలయన్స్‌ జియోతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Next Story