నరేంద్రమోదీపై ఫేస్‌బుక్ ఉద్యోగులు అనుచిత వ్యాఖ్యలు చేశారు: రవిశంకర్ ప్రసాద్

By సుభాష్  Published on  2 Sep 2020 5:52 AM GMT
నరేంద్రమోదీపై ఫేస్‌బుక్ ఉద్యోగులు అనుచిత వ్యాఖ్యలు చేశారు: రవిశంకర్ ప్రసాద్

ఫేస్ బుక్ సంస్థ బీజేపీకి మద్దతుగా ఉంటోందని, ఆ పార్టీ నేతలు విచ్చలవిడిగా కామెంట్లు చేస్తున్నా కూడా కనీసం పట్టించుకోలేదంటూ కాంగ్రెస్ పార్టీ గత కొద్దిరోజులుగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.. అందుకు సంబంధించిన లేఖలను కూడా ఫేస్ బుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ కు రాశారు. ఇలాంటి తరుణంలో కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఫేస్ బుక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేస్ బుక్ ఉద్యోగులు భారత ప్రధాని నరేంద్ర మోదీ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని రవి శంకర్ ప్రసాద్ ఆరోపించారు. ఈ విషయమై రవిశంకర్ ప్రసాద్ ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు లేఖ రాశారు.

ప్రధాని మోదీపై ఫేస్‌బుక్ ఉద్యోగులు అనుచిత వ్యాఖ్యల గురించి లేఖలో ప్రస్థావించారు. సోషల్ మీడియా వేధికగా ఫేస్‌బుక్ ఉద్యోగులు ప్రధానినికి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి కీలక పదవుల్లో ఉన్నవారు కూడా ప్రధానిని విమర్శిస్తున్నారని అన్నారు. రైట్ వింగ్ ఐడియాలజీపైనా ఉద్దేశపూర్వక దాడి జరుగుతున్నట్లుగా ఉందని, దీనిపై వివరణ ఇవ్వాలని జూకర్‌బర్గ్‌ను ఆయన కోరారు. ఊహించని విధంగా కొన్ని పేజీలు డిలీట్ అయ్యాయని, ఇంకొన్నిటికి రీచ్ అనూహ్యంగా తగ్గిపోయిందని.. ఇదంతా ఫేస్ బుక్ సంస్థ బాధ్యతగా రవి శంకర్ ప్రసాద్ తెలిపారు.

ఫేస్ బుక్ సంస్థ ఫెయిర్ గా న్యూట్రల్ గా ఉండాలని అన్నారు. అలాంటప్పుడే యూజర్లు కూడా తమకు నచ్చిన ఐడియాలజీ వైపు మళ్లుతారని అన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఐడియాలజీ ఉంటుందని అది పబ్లిక్ ఆర్గనైజేషన్ కు అంటించడం తప్పని అన్నారు. కొందరి మాత్రమే వత్తాసు పలికే ఉద్యోగులు పెద్ద పెద్ద స్థానాల్లో ఉండడం వలన మిలియన్ల కొద్దీ ప్రజలు ఇబ్బందులకు గురవుతారని లెటర్ లో కోరారు. అంతర్గత లీకుల కారణంగా కూడా ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యే విషయాన్ని గుర్తు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టుల కారణంగా భారతదేశ ప్రజాస్వామ్యం కూడా విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. తప్పుడు సమాచారం నుండి యూజర్లను రక్షించే విధంగా ఫేస్ బుక్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో సమాధానం ఇవ్వాలని కోరారు. ఫ్యాక్ట్ చెక్ ల విషయంలో కూడా ఫేస్ బుక్ సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Next Story