అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Sep 2020 1:50 AM GMT
అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని పొడిగించారు. కమర్షియల్‌ ప్యాసింజర్‌ విమానాలపై నిషేదం సెప్టెంబర్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కార్గో విమానాలకు ఇది వర్తించదని కేంద్ర విమానయాన శాఖ ఒక ప్రకనటలో పేర్కొంది. డీజీసీఏ అనుమతి ఉన్న విమానాలకు ఈ నిబంధనలు వర్తించదని తెలిపింది. ఎంపిక చేసిన రూట్లలో మాత్రం అధికారిక అనుమతి పొందిన విమానాలకు అవకాశం ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

అయితే విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్ర సర్కార్‌ వందేభారత్‌ మిషన్‌ చేపట్టిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 1 నుంచి 31 వరకు ఆరో దశ వందేభారత్‌ మిషన్‌ చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎయిర్‌ ఇండియా విడుదల చేసింది. కరోనానేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇక అన్‌లాక్‌4.0 మార్గదర్శకాల్లో భాగంగా

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో అన్‌లాక్‌ 3.0 రేపటితో ముగియనుంది. ఇక సెప్టెంబర్‌ 1 నుంచి అన్‌లాక్‌ 4.0 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్‌లాక్‌ 4.0కు సంబంధించి మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. సెప్టెంబర్‌ 7వ తేదీ నుంచి మెట్రో రైళ్లు నడిపించుకునేందుకు అనుమతి ఇచ్చింది. పట్టణ అభివృద్ధి, రైల్వేశాఖలు కేంద్ర హోంశాఖతో సంప్రదించి దశల వారీగా మెట్రో సేవలు ప్రారంభించుకోవాలని సూచించింది.

అలాగే 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లు ప్రారంభించుకోవచ్చని కేంద్రం తెలిపింది. అదే విధంగా రాజకీయ సభలు, సమావేశాలు, వినోదం, మతపరమైన సమావేశలు నిర్వహించుకోవాలంటే వంద మందికి మించకూడదని కేంద్రం తెలిపింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో సెప్టెంబర్‌ 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగించాలని నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా అన్ని రకాల విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు మూసివేసే ఉంచాలని తెలిపింది. ఈ నేపథ్యంలో అన్‌లాక్‌ 4.0కు సంబంధించిన మార్గదర్శకాలు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌బల్లా ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story
Share it