హైదరాబాద్‌: నగరంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పేలుడు కలకలం సృష్టించింది.

ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.

రియాకర్టర్‌ పేలడంతో పరిసర ప్రాంతాల్లో దట్టంగా రసాయనిక పొగలు అలుముకున్నాయి.

దీంతో కార్మికులు ఫ్యాక్టరీలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ షెడ్‌లు చెల్లాచెదురుగా ఎగిరి పడ్డాయి.

Jeedimetla Industrial Area 1

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.