యూపీ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో పేలుడు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Nov 2019 9:40 AM GMT
యూపీ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో పేలుడు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌: రాష్ట్రంలోని ఓ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పేలుడు సంభవించింది. టర్బైన్ జనరేటర్ యూనిట్‌ ఒక్కసారిగా పేలుడుకు గురైంది. దీంతో అక్కడ పనిచేస్తున్న నలుగురు ఇంజనీర్లు తీవ్రంగా గాయపడ్డారు. సోనే భద్ర జిల్లాలో ఉన్న ఈ విద్యుత్ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా విధుల్లో ఉండగా గాయపడిన నలుగురు ఇంజనీర్లను అక్కడి సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాగా ప్రమాదం జరిగిన వెంటనే ఆ ధికారుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటల్ని అదుపు చేస్తున్నారు. యూపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్లాంట్ లో ప్రమాదం కారణంగా విద్యుత్ ఉత్పత్తికి ఆరు నెలలపాటు అంతరాయం కలగనుందని అధికారవర్గాల సమాచారం.

Next Story