'రామోజీ ఫిల్మ్ సిటీ'లో పేలుడు

By సుభాష్  Published on  9 Feb 2020 2:47 PM GMT
రామోజీ ఫిల్మ్ సిటీలో పేలుడు

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో పేలుడు సంభవించింది. ఓ పెయింటింగ్ వేస్తుండగా, రసాయనాలతో కూడిన డబ్బా పేలినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తి మహారాష్ట్రలోని నాందేడ్‌ వాసిగా తెలుస్తోంది. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చి గత ఆరు సంవత్సరాలుగా సిటీలో ఉద్యోగం చేసుకుంటున్నట్లు సమాచారం. ఆదివారం రావ్‌ సాహెబ్‌ అనే వ్యక్తి ఆసిడ్‌ డబ్బాతో తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వ్యక్తిని హుటాహుటిని చికిత్స నిమిత్తం కొత్తపేటలోని సాయి సంజీవని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పేలుడు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డాగ్‌ స్వ్కాడ్‌ బృందాన్ని రప్పించి తనిఖీలు చేపట్టారు. కాగా, శనివారం ముషీరాబాద్‌ పరిధిలోని రాంనగర్‌లోనూ ఇలాంటి పేలుడు జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. చెత్తకుండీ వద్ద పేలుడు సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు.

Next Story