హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీలకు ప్రభుత్వం కొత్త ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిళ్లను నియమించింది. ఉస్మానియా, జేఎన్‌టీయూ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మగాంధీ, జేఎన్‌ఏఎఫ్‌యూ యూనివర్సిటీలకు కొత్త పాలక మండళ్లను నియమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటలో విద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు విద్యాశాఖ పాలక మండళ్లను నియమించింది. రెండు, మూడు వారాల్లో యూనివర్సిటీలకు కొత్త వైస్‌ ఛాన్స్‌లర్‌లను నియమించాలని ఈ నెల 19న సీఎం కేసీఆర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఒక్కో పాలకమండలిలో తొమ్మిది సభ్యులు ఉంటారు. విద్యావేత్తలు, సామాజిక వేత్తలు, పారిశ్రామిక వేత్తలు, విశిష్ట వ్యక్తుల కింద నలుగురికి ఈ కౌన్సిల్‌లో స్థానం కల్పించారు.

అప్పట్లో పాలక మండళ్లు లేకపోవడంతో.. వైస్‌ ఛాన్స్‌లర్‌ల నియమాకానికి ప్రభుత్వం గత జులైలోనే అన్వేషణ కమిటీలను నియమించింది. దీంతో ఐఏఎస్‌ అధికారులతో కూడిన పర్యవేక్షణ, అభివృద్ధి కమిటీలే నామినీని ప్రతిపాదించాయి. ఈ నేపథ్యంలోనే పాలక మండళ్లను విద్యాశాఖ నియమించింది. నామినీ పేర్లను పాలకమండళ్లు ఆమోదించి పంపకుంటే న్యాయపరమైన సమస్యలు వస్తాయని.. ముందుగానే పసిగట్టిన ప్రభుత్వం పాలకమండళ్లను నియమించింది. కాగా వీసీల నియమాకానికి మరో మూడు వారాల సమయం పడుతుందని అంచనా..

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.