ఎలక్షన్ కమిషనర్ కు క్వారంటైన్ వర్తించదా ?
By రాణి Published on 12 April 2020 1:44 PM GMTముఖ్యాంశాలు
- గవర్నర్ కు బెదిరింపులేమైనా వచ్చాయా ?
- సీఎం జగన్ ను ఎదిరిస్తే బతకనివ్వరా ?
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ వైసీపీ కక్షపూరిత రాజకీయాలకు తెరలేపుతోందని రెండు మూడ్రోజులుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా తొలగించినప్పటి నుంచి ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జగన్ ఇప్పుడు నిజంగా తుగ్లక్ లాగానే వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రమేష్ కుమార్ తనను ఎన్నికల కమిషనర్ గా తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
అయితే టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ కు, గవర్నర్ కు, ప్రభుత్వ అధికారులకు పలు ప్రశ్నలు సంధించారు.
'' కరోనా నుంచి రాష్ట్రాన్ని కాపాడిన రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ పదవి నుంచి కక్షపూరితంగా, అప్రజాస్వామికంగా తొలగిస్తుంటే గవర్నర్ ఎలా సంతకం పెడతారు? మొన్న రమేష్ కుమార్ కి వచ్చేనట్టే గవర్నర్ కూ బెదిరింపులేమైనా వచ్చాయా ? ఒక డెమోక్రటిక్ హెడ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడా లేదా ఓ నియంత పరిపాలన సాగుతుందా అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఏపీ ఎలక్షన్ కమిషనర్ పదవి నుంచి రమేష్ కుమార్ ను అప్రజాస్వామికంగా తొలగించారు. ఆరోజు ఎన్నికలు వాయిదా వేసి కరోనా నుంచి రాష్ట్రాన్నికాపాడారు రమేష్ కుమార్. దానిని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించి, గవర్నమెంట్ ను తప్పుబట్టింది. ఆ తర్వాత రమేష్ కుమారు తన ప్రాణాలకు హాని ఉందని బయటి రాష్ట్రాలకు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా నుంచి ప్రజలను కాపాడిన రమేష్ కుమార్ ను అర్థంతరంగా, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా తొలగిస్తుంటే రాష్ట్ర ప్రథమ పౌరుడు, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్, ఇంకొక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఎలక్షన్ కమిషనర్ ను నియంతృత్వంగా తొలగిస్తుంటే ఒక గంట కూడా ఫైల్ ఆపలేకపోయారు. సుప్రీంకోర్టు రమేష్ కుమార్ నిర్ణయాన్ని సమర్థించిన విషయంపై కక్ష కట్టి రమేష్ కుమార్ పై ప్రతీకారం తీర్చుకున్నారు. నాకు తెలిసి ఒక ఎస్ఈసీగా నియమించాలంటే 60 సంవత్సరాలు ఉండాలి. కానీ ఈ రోజు చెన్నై నుంచి నేరుగా 84 ఏళ్ల కనకరాజును నియమిస్తుంటే గవర్నర్ ఎలా చూస్తూ ఊరుకున్నారు ? ఆరోజు రమేష్ కుమార్ తన ప్రాణాలకు రక్షణ కావాలని అడిగినట్లే..ఈరోజు గవర్నర్ కు కూడా ఏమైనా వార్నింగ్స్ ఉన్నాయా ?
మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రతిపక్ష ప్రధాన నాయకుడు చంద్రబాబు విజయవాడ, అమరావతికి రావాలంటే మీ మంత్రులు 14 రోజులు క్వారంటైనా కావాలని మాట్లాడుతారు. మీరు నియమించిన 84 ఏళ్ల కనకరాజు మాత్రం చెన్నై నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ వచ్చేసి విధుల్లో చేరుతారు. వారికి క్వారంటైన్ అక్కర్లేదా ? మీరు ధనికులు, ధనిక పారిశ్రామిక వేత్తలు, మీరు ఎక్కడినుంచైనా వచ్చి చెక్కులిచ్చేసి వెళ్లిపోవచ్చు. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలో హైదరాబాద్ లో ఉంటూ ఎప్పుడైనా వచ్చి ఇక్కడ తిరిగేసి వెళ్లిపోవచ్చు. చంద్రబాబునాయుడు అమరావతికి రాకూడదు గానీ మీరు మాత్రం మీ ఇష్టారాజ్యంగా ఉండొచ్చు. ఏమనుకుంటున్నారో మీరు మాకు అర్థం కావడం లేదు. మీ కనుసన్నల్లో ఎవరైనా ఉండకపోతే వాడు ఆంధ్రప్రదేశ్ లే ఉండటానికి వీల్లేదన్న స్థితికి మీరొచ్చాశారంటే అది మీ పాలనకు, ధోరణికి పరాకాష్ట '' అని అన్నారు.