సరిలేరు నీకెవ్వరు అంటూ కేసీఆర్ పై బండ్ల గణేష్ ప్రశంసలు

By రాణి  Published on  12 April 2020 12:07 PM GMT
సరిలేరు నీకెవ్వరు అంటూ కేసీఆర్ పై బండ్ల గణేష్ ప్రశంసలు

తెలంగాణలో కరోనా మహమ్మారి కాస్త తగ్గినట్లే అనిపించినా..మనకు తెలియకుండానే చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికి రాష్ట్రం కరోనా కేసులు 500 దాటిపోయాయి. వీరిలో కొంతమంది డిశ్చార్జి అవ్వగా 14 మంది చనిపోయారు. ఇంకా 350 కిపైగా యాక్టివ్ కేసులున్నాయి. వీరంతా గాంధీలో చికిత్స పొందుతున్నారు. ఇంకా రెండ్రోజుల్లో లాక్ డౌన్ గడువు పూర్తవుతుందనగా నెలాఖరు వరకూ లాక్ డౌన్ ను పెంచుతూ సీఎం కేసీఆర్ శనివారం రాత్రి సంచలన ప్రకటన చేశారు. కాగా..రాష్ట్ర ప్రజల క్షేమం కోసం సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. మీలాంటి సీఎం దేశంలో ఎక్కడా ఉండరంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తాజాగా నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ కూడా కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

Also Read : పురుషులు ఆ సమస్యతో తెగ ఇబ్బంది పడిపోతున్నారట

'' మా క్షేమం కోసం సమాజం కోసం మా పిల్లల కోసం మా భవిష్యత్తు కోసం మీరు తీసుకునే నిర్ణయాల్లో సరిలేరు నీకెవ్వరు. నాలుగు రోజులు కాదుసార్ మీ మీద నమ్మకం తో మీరు ఉన్నారు అన్న భరోసాతో 40 రోజులు అయినా ఓపికతో ఇళ్ల కే పరిమితం అవుతోంది. విజయం సాధిస్తాం.మీరు చేసే కార్యక్రమాలు మీరు తీసుకునే నిర్ణయాలు అన్ని భగవంతునితో జయప్రదం కావాలని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ప్రేమ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కఠోరమైన సమయంలో రాజకీయాలను పక్కన పెట్టి కెసిఆర్ నాయకత్వంలో పని చేసి తెలంగాణ ప్రజలకు బంగారు భవిష్యత్ ఇవ్వాలని అందర్నీ వేడుకుంటున్నాను. భారతదేశ చరిత్రలో ఇటువంటి సమయాల్లో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. '' అని బండ్ల గణేష్ సీఎం కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. మీరున్నారన్న ధైర్యంతో మేమంతా ఇళ్లలో ఉంటాం.. అని పేర్కొన్నారు.

Bandla Ganesh Tweets

Next Story
Share it