కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
By సుభాష్ Published on 5 Oct 2020 5:03 PM ISTకేంద్ర మాజీ మంత్రి రషీద్ మసూద్ (75) సోమవారం కన్నుమూశాడు. ఇటీవల ఆయన ఆరోగ్యం కారణంగా రూర్కిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని మసూద్ కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. రషీద్ ఐదు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంతేకాకుండా పలు దఫాలు రాజ్యసభకు కూడా ఎంపికయ్యారు. 1889లో జనతాదళ్ తరపున లోక్‌సభకు ఎన్నికై అప్పటి ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ సహాయ మంత్రిగా పని చేశారు.
కాగా, రషీద్ మసూద్‌కు గతంలో కరోనా సోకడంతో ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేర్పించామని, ఆయన ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత సహ్రాన్‌పూర్‌కు తిరిగి తీసుకొచ్చామని కుటుంబీకులు తెలిపారు. కొంత కాలంగా బాగానే ఉన్నా.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో రూర్కీలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించామని తెలిపారు.
Also Read
పేలుళ్ల కుట్రను ఛేదించిన ఢిల్లీ పోలీసులు
Next Story