నేను ఆరోగ్యంగా ఉన్నా.. ఆందోళన చెందొద్దు - మంత్రి కేటీఆర్ ట్వీట్
By Newsmeter.Network Published on 12 May 2020 3:17 PM ISTతాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి కేటీఆర్ మంగళవారం ట్వీట్ చేశారు. సోమవారం మంత్రి రాజన్నసిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో 275 మంది కార్మికులకు నిత్యావసర సరుకులు, నగదు పంపిణీ చేశారు. ఇంకా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జలుబుతో కొంత అస్వస్థతగా ఉన్నా కేటీఆర్ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా చంద్రంపేటలో పవర్‌లూం కార్జానాలు పరిశీలించే కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.
Also Read :ఏపీ ఏకపక్ష నిర్ణయంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం
దీంతో మంత్రి కేటీఆర్ ఆరోగ్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్విటర్ వేధికగా సూచించారు. సోమవారం నుంచి తన ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సిరిసిల్లలో పర్యటిన సందర్భంగా తనకు అనేక సంవత్సరాలుగా ఉన్న జలుబుకు సంబంధించిన ఎలర్జీ వచ్చిందని, అప్పటికే పర్యటనకు సంబంధించిన పలు కార్యక్రమాలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఎవరికీ ఇబ్బంది కలగొద్దన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని కొనసాగించాల్సి వచ్చిందని కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ ట్వీట్‌తో 'ఆన్నా ఆరోగ్యం జాగ్రత్త' అంటూ అభిమానులు, తెరాస కార్యకర్తలు రీట్వీట్‌లు చేశారు.