ఆహారం మిగిలిందా?.. ఇలా చెయ్యండి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Oct 2019 6:13 AM GMT
ఆహారం మిగిలిందా?.. ఇలా చెయ్యండి

మీ మనసొప్పకపోయినా.. మీ ఇంట్లో మిగిలిన ఆహారాన్ని పడేస్తున్నారా..? అన్నార్తుల ఆకలి తీర్చాలని మనసులో ఉన్నా దానికి మార్గం తెలియక సతమతమవుతున్నారా..? అయితే మీ లాంటి వాళ్లకోసమే మొదలైంది ఈ ఫీడింగ్ ఇండియా కాంపెయిన్. ఇందులో భాగంగా భువనేశ్వర్ లోని ఒక NGO హ్యాపీ ఫ్రిడ్జ్ లను ఏర్పాటు చేసింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, కానీ మనం అన్నాన్ని ఏదో ఒక కారణంతో వ్యర్థం చేస్తూనే ఉంటాం. కాస్త ఎక్కువ అయిపోయిందనో, ఇంట్లో ఫంక్షన్లో మిగిలిపోయిందనో ఏదో ఒక కారణంతో దాన్ని చెత్తకుప్ప పాలు చేస్తాం. నిజానికి తినేందుకు అనువుగా ఉండి కూడా చెత్త కుప్ప పాలయ్యే పదార్థాలే ఎక్కువ. ఇదే ఆహారం కొంత మంది ప్రాణాలను నిలబెడుతుందని మీకు తెలుసా..? దీనిలో భాగంగానే ఫంక్షన్లలో మిగిలిన ఆహారాన్ని ఆకలితో ఉన్న వారికి అందించేలా కొన్ని సంస్థలు నడుం బిగించాయి. అలాగే మీరు కూడా మీ ఇంట్లో మిగిలిన ఆహారాన్ని ఏరోజుకారోజు అందులో పెడితే అవసరమైన వారు తీసుకుంటారని ఈ NGO నిర్వాహకులు చెబుతున్నారు. అవసరమైతే ఇంటికి వచ్చి సేకరించడానికి వాలంటీర్లు కూడా సిద్దంగా ఉంటారు. చాలామందికి మిగిలిన పదార్థాలు ఎవరికన్నా ఇవ్వాలని ఉంటుందని అయితే మొహమాటం, తీసుకున్న వాళ్ళు ఏమనుకుంటారో అని రకరకాల ఆలోచనలు వారిని ముందుకు వెళ్ళనివ్వవని ఈ హ్యాపీ ఫ్రిడ్జ్ కాన్సెప్ట్ ద్వారా అలాంటి సమస్యలు ఉండవని చెబుతున్నారు.

Next Story