హైదరాబాద్ : నేడు ఈఎస్ఐ స్కామ్ కేసు ఏసీబీ కోర్టులో విచారణ జ‌రుగ‌నుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన 8 మంది నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని ఏసీబీ కోరింది. మరోవైపు బెయిల్ మంజూరు చేయాలని 8 మంది నిందితులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. రెండు పిటిషన్ లపై ఏసీబీ కోర్ట్ నేడు వాదనలు విననుంది. మరోవైపు ఈఎస్ఐ స్కామ్ కేసులో నేడు మరికొంత మందిని ఏసీబీ విచారించనుంది. అలాగే రాష్ట్ర‌ వ్యాప్తంగా ఉన్న 70 డిస్పెన్సరీల వద్ద ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఈ స్కామ్ లో భాగ‌స్వామ్యులుగా ఉన్న‌ మరికొంత మందిని ఏసీబీ అరెస్ట్  చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.