హైదరాబాద్ : తేజా ఫార్మా ఎండీతో కలిసి దేవికారాణి 8 షెల్‌ కంపెనీల ఏర్పాటు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 8 డొల్ల కంపెనీల నుంచి రూ.25కోట్లకు పైగా మందుల కొనుగోళ్లు చేసినట్లు అధికారులు కనుగొన్నారు.
రూ.5 కోట్ల విలువైన మందులను రూ.25కోట్లకు కొన్న దేవికారాణి బదిలీ చేసినట్లు గుర్తించారు. డొల్ల కంపెనీల నుంచి వచ్చిన డబ్బులతో దేవికారాణి జల్సాలు చేసినట్లు కూడా అధికారుల విచారణలో బయట పడినట్లు తెలుస్తోంది. పీఎంజే నగల దుకాణానికి డొల్ల కంపెనీల నిధులు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. పీఎంజేలో పెద్ద మొత్తంలో వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాల కొనుగోలు చేసినట్లు తెలుసుకున్నారు. డబ్బులతో ఆస్తులు కొనుగోళ్లు, జల్సాలు చేసిన దేవికారాణి జల్సాల వీడియోలు బట్టబయలు అయినట్లు తెలుస్తోంది. దేవికారాణి జల్సాలపై అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.