ఈఎస్‌ఐ స్కామ్ : ఏసీబీ సోదాల్లో వెలుగులోకి మరో అక్రమం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Oct 2019 1:21 PM GMT
ఈఎస్‌ఐ స్కామ్ : ఏసీబీ సోదాల్లో వెలుగులోకి మరో అక్రమం

ఈఎస్‌ఐ అసుపత్రిలో మందుల కొనుగోలు స్కామ్ లో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తుంది. తాజాగా మరో అక్రమం బయట పడింది. ఓమ్నీమెడి ఉద్యోగి నాగరాజు ఇంట్లో బుధవారం ఏసీబీ సోదాలు జ‌రిగాయి. ఈ సోదాల్లో అనేక కొత్తవిషయాలు బయట పడ్డాయి. ఈస్కామ్‌లో కీలకంగా ఉన్న నాగరాజు ఇంట్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు అధికారిక డాక్యుమెంట్లు బయటపడ్డాయి.

దాదాపు 46 కోట్ల విలువైన ఒరిజినల్‌ పర్చేజెస్‌ ఆర్డర్లు, ఇండెంట్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐఎంఎస్‌ డైరెక్టరేట్‌లో ఉండాల్సిన ఒరిజినల్‌ పత్రాలు ప్రైవేట్‌ వ్యక్తి చేతుల్లోకి ఎలా వెళ్లాయన్నకోణంలో అధికారులు దర్యాప్తుచేస్తున్నారు. ఈ మొత్తం కుంభకోణంలో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. దీంతో అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయన్నది స్పష్టమవుతోందని ఓ అధికారి తెలిపారు. కాగా ఇప్పటికే నాగరాజును ఏబీబీ అధికారులు అరెస్ట్‌చేసి విచారిస్తున్నారు.

Next Story