విజయవాడ : ఈ రోజు ఉద‌యం నుండి న‌గ‌రంలోని ఈఎస్ఐ డైరెక్టరేట్‌లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేప‌ట్టారు. ఈఎస్ఐ రికార్డ్స్, అకౌంట్స్ ల‌లో అవకతవకలు జరిగాయన్న అనుమానంతో అధికారులు ఈ తనిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ప్రతి ఫైల్ ను క్షుణ్ణంగా పరిశీలించ‌డంతో పాటు.. ఈఎస్ఐ సిబ్బందిని విచారిస్తున్నారు. ఈ త‌నిఖీలు విజిలెన్స్ ఎస్పీ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకూ.. తనిఖీలు కొన‌సాగుతాయి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.