ఈ హీరో  తెలియకుండానే మంచి చేస్తాడట.?  

By అంజి  Published on  23 Dec 2019 10:04 AM GMT
ఈ హీరో  తెలియకుండానే మంచి చేస్తాడట.?  

ఫ్యామిలీ చిత్రాల డైరెక్టర్ గా పేరుగాంచిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాబోతున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ "ఎంత మంచివాడవురా". కాగా ఈ సినిమా కథ గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. తనకు తెలియకుండానే హీరో చేసే కొన్ని పనులు వల్ల ఓ ఊరుకి పెద్ద మేలు జరుగుతుందట. అదే విధంగా అప్పటికే హీరో చేసిన కొన్ని ఆకతాయి పనులు కారణంగా కూడా చాలామందికి మంచి జరుగుతుందట. మొత్తానికి హీరో ఇవ్వన్నీ తానూ కావాలని చేయడని, అనుకోకుండా అతను చేసే పనులు వల్ల పక్కవారికి అంతా మంచి జరుగుతుందని తెలుస్తోంది. ఇదే ఈ చిత్రం మెయిన్ పాయింట్ అని తెలుస్తోంది.

ఆ మధ్య గతంలోనూ ఈ చిత్రం కథ గురించి అనేక రూమర్స్ వచ్చాయి. గుజ‌రాతీ చిత్రం 'ఆక్సిజ‌న్' సినిమా ప్రేరణతో ఈ సినిమా కథ రాసుకున్నారని... కథ విషయానికి వస్తే.. నాట‌కం స్టేజ్‌ పైనే పుట్టిన హీరో.. ఆ తరువాత అతని లైఫ్ లో ఎదురైన కొన్ని సంఘటనల కారణంగా ఒక నాటకం లాగే.. ఈ జీవితం కూడా ఓ నాట‌క రంగమే అని నమ్ముతాడట. ఆ తరువాత అంద‌రికీ సాయం చేస్తూ.. మంచితనానికి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తాడని.. ఈ సినిమా కథాంశం ఇదేనని గతంలో వార్తలు వచ్చాయి. మరి ఈ రెండు వార్తల్లో ఎంత నిజం ఉందో చూడాలి.

శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సారి సంక్రాంతికి మహేష్ 'సరిలేరు నీకెవ్వరూ', అలాగే బన్నీ 'అల వైకుంఠపురంలో' చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలకి పోటీగా "ఎంత మంచివాడవురా" మూవీ కూడా రాబోతుంది. మరి సంక్రాంతి పోటీలో "ఎంత మంచివాడవురా" నెగ్గుతాడో లేదో చూడాలి.

Next Story