'ఆర్ఆర్ఆర్' అభిమానుల‌కు శుభ‌వార్త‌.. ఉచితంగానే చూడొచ్చు

ZEE5 to release 'RRR' for zero additional cost.యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ లు ప్ర‌ధాన పాత్ర‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 May 2022 2:27 PM IST
ఆర్ఆర్ఆర్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. ఉచితంగానే చూడొచ్చు

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ లు ప్ర‌ధాన పాత్ర‌లో ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం)'. మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీని సృష్టించింది. దాదాపు రూ.450 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించిన ఈ చిత్రం ప్రపంచ‌వ్యాప్తంగా రూ.1100 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు చేసి రికార్డు సృష్టించింది. ఇన్నాళ్లు థియేట‌ర్ల‌లో అల‌రించిన ఈ చిత్రం రేప‌టి(మే 20) నుంచి ఓటీటీలో సంద‌డి చేయ‌నుంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5లో శుక్ర‌వారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్ర‌మంలో త‌మ సబ్‌స్క్రైబర్లు జీ 5 శుభవార్త అందించింది. ఈ చిత్రానికి చూసేందుకు ఎలాంటి అద‌న‌పు చార్జీలు వ‌సూలు చేయ‌బోమ‌ని ప్ర‌క‌టించింది. సబ్‌స్క్రైబర్లు ఈ చిత్రాన్ని ఉచితంగా చూడొచ్చున‌ని తాజాగా ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇంత‌క ముందు అయితే ఈ చిత్రం T VOD (ట్రాన్సాక్ష‌న‌ల్ వీడియో ఆన్ డిమాండ్‌) విధానంలో అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు తెలిపింది. అంటే ఈ చిత్రాన్ని చూడాలంటే సబ్‌స్క్రైబర్లు రూ.100 చెల్లించాలి. అయితే..దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో త‌మ ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కి తీసుకుంటూ .. 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని ఉచితంగా చూడొచ్చున‌ని జీ5 తెలిపింది.

Next Story