సీఎం జగన్‌ బర్త్‌ డే స్పెషల్‌.. 'యాత్ర-2' అప్‌డేట్‌ ఇచ్చిన మేకర్స్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన 'యాత్ర' సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర-2' సినిమా తెరకెక్కుతోంది.

By అంజి  Published on  21 Dec 2023 11:28 AM IST
YS Jagan birthday special, Yatra 2, Yatra 2 movie poster

సీఎం జగన్‌ బర్త్‌ డే స్పెషల్‌.. 'యాత్ర-2' అప్‌డేట్‌ ఇచ్చిన మేకర్స్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన 'యాత్ర' సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర-2' సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వైఎస్‌ఆర్‌తో పాటు వైఎస్‌ జగన్‌ పాత్ర ఉంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్‌ ప్రకటించారు. 'యాత్ర-1' విడుదలైన తేదీ రోజే.. అంటే ఫిబ్రవరి 8వ తేదీన 'యాత్ర-2' విడుదల కానుంది. ఈ సినిమాను మహి వి.రాఘవ తెరకెక్కిస్తున్నారు. ఇవాళ సీఎం జగన్‌ బర్త్‌ డే సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో వైఎస్సార్‌గా మమ్ముట్టి కనిపించగా.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిగా జీవా కనిపించాడు.

ఈ పోస్టర్‌ను చూసి వైఎస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 'యాత్ర 2' సినిమా వైఎస్‌ఆర్‌ చనిపోయిన తర్వాత నుంచి మొదలవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రధానంగా వైఎస్‌ జగన్‌ పాదయాత్రను చూపించబోతున్నట్లు సమాచారం. పాదయాత్రతో మొదలై, సీఎం అయ్యే వరకు ఈ సినిమా స్టోరీ కొనసాగనుందట. అంతేకాదు, జగన్ పాలనలో ప్రజలు ఎలా ఉన్నారు అనేది కూడా టచ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 'యాత్ర 2' చిత్రాన్ని త్రి ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.

Next Story