కొత్త ఇల్లు కొన్న షణ్ముఖ్ జస్వంత్
Youtube Star Shanmukh Jaswanth buys new house in Hyderabad.యూట్యూబ్ స్టార్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్
By తోట వంశీ కుమార్
యూట్యూబ్ స్టార్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ సొంతింటి కలను నెరవేర్చుకున్నాడు. హైదరాబాద్‌లో ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేసిన జస్వంత్ గృహప్రవేశం కూడా చేశాడు. చాయ్ బిస్కెట్ ఫేం శ్రీవిద్యతో కలిసి కొత్త ఇంట్లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొత్త ఇంటితో పాటు కొత్త లక్ష్యాలతో జీవితంలో పయనించాయంటూ కామెంట్లు చేస్తున్నారు.
బిగ్‌బాస్ సీజన్ 5 లో పాల్గొన్న జస్వంత్ రన్నరప్‌గా నిలిచాడు. ఆటతో కంటే సిరితోనే ఎక్కువగా హైలైట్ అయ్యాడు. వీరిద్దరూ చేసిన హంగామా చాలా మందికి నచ్చలేదు. ఇక బయటకు వచ్చిన తరువాత దీప్తి సునయన అతడికి బ్రేకప్ చెప్పేసింది. దీంతో ప్రస్తుతం ఒంటరిగా ఉన్నాడు. ఇక బ్రేకప్ అనంతరం షణ్ముఖ్ కెరీర్ మీద మరింత ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే ఓ కొత్త వెబ్ సిరీస్ ని అనౌన్స్ చేశాడు. హీరోగా లాంచ్ అవ్వడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కాగా.. ఈ ఇల్లు తన కుటుంబ సభ్యుల కోసం కాదట. తన స్నేహితుల కోసం, తన యూ ట్యూబ్ వెబ్ సిరీస్ కార్యకలాపాల కోసం కొన్నాడట.