'పుష్ప 2' సెట్‌లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్.. ఫొటో వైరల్

తన రాబోయే కొత్త చిత్రం షూటింగ్‌ కోసం జూనియర్ ఎన్టీఆర్.. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు. కొరటాల శివ దర్శకత్వంలో

By అంజి  Published on  27 April 2023 2:02 PM IST
Young Tiger NTR, Allu Arjun, Pushpa 2

'పుష్ప 2' సెట్‌లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్.. ఫొటో వైరల్

తన రాబోయే కొత్త చిత్రం షూటింగ్‌ కోసం జూనియర్ ఎన్టీఆర్.. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా అక్కడే షూటింగ్‌ జరుగుతోంది. అయితే షూటింగ్‌ గ్యాప్‌లో అక్కడే ఉన్న 'పుష్ప 2' సెట్ చూసి వచ్చారు. ఇప్పుడు 'పుష్ప: ది రూల్' సెట్ నుండి 'ఆర్‌ఆర్‌ఆర్‌' స్టార్ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఎన్టీఆర్‌ ఎందుకు సెట్స్‌కి వెళ్లాడు అనేది మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతానికి పుష్ఫ సెట్‌లో ఎలాంటి చిత్రీకరణ జరగడం లేదు.

'పుష్ప' ఫస్ట్‌ పార్ట్‌లో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి చివరికి పెద్ద స్థానానికి చేరుకున్న ట్రక్ డ్రైవర్‌గా కనిపించాడు. ఈ చిత్రంలో శ్రీవల్లి కథానాయికగా రష్మిక మందన్న నటించింది. ఇప్పుడు సెకండ్‌ పార్ట్‌ 'పుష్ప 2: ది రైజ్'లో కథ అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ చుట్టూ తిరుగుతుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం తన తదుపరి ఇంకా పేరు పెట్టని తెలుగు చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇది జాన్వీ కపూర్ యొక్క తెలుగు అరంగేట్రం మూవీ. ఈ సంవత్సరం చివర్లో ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. 'వార్ 2'లో నటుడు హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోబొతున్నారు. 'వార్ 2'తో ఎన్టీఆర్ హిందీ చిత్రసీమలో అరంగేట్రం చేయనున్నాడు.

Next Story