పబ్లిక్‌లో షారుఖ్‌కి ముద్దుపెట్టిన యువతి..నెట్టింట వైరల్

ఓ ప్రోగ్రాంలో పాల్గొన్న షారుఖ్‌ను ఓ యువతి బలవంతంగా ముద్దు పెట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో

By Srikanth Gundamalla  Published on  14 Jun 2023 6:29 PM IST
Girl kiss, Shah rukh Khan, Viral Video, Dubai

 పబ్లిక్‌లో షారుఖ్‌కి ముద్దుపెట్టిన యువతి..నెట్టింట వైరల్

షారుఖ్‌ ఖాన్‌ను బాలీవుడ్‌ బాద్‌షాగా పిలుస్తారు. ఆయనకు ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉంటారు. అభిమానులు ఎక్కువగా ఉండటం ఎంతో అదృష్టం కానీ.. బయటకు వెళ్లినప్పుడు అప్పుడప్పుడు ఊహించని ఘటనలు ఎదురవుతుంటాయి. షారుఖ్‌ ఖాన్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ ప్రోగ్రాంలో పాల్గొన్న షారుఖ్‌ను ఓ యువతి బలవంతంగా ముద్దు పెట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

షారుఖ్‌ ఖాన్‌ హీరోగా వచ్చిన పఠాన్‌ సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమాకు ముందు షారుఖ్‌ఖాన్‌ జనాల్లోకి అంతగా రాలేదు. హిట్‌ కొట్టాక ఇప్పుడిప్పుడే ఆయన అభిమానుల మధ్య వస్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే షారుఖ్‌ ఖాన్‌ దుబాయ్‌ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. షారుఖ్‌ వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడికి భారీగానే వెళ్లారు. కార్యక్రమం అనంతరం ఆయన్ని కలిసే ప్రయత్నం చేశారు. కలిసి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి.. ఫొటో తీసుకునే వరకూ ఓకే కానీ.. ఓ యువతి కాస్త కంగారు పెట్టేలా ప్రవర్తించింది. షారుఖ్‌ వద్దకు వెళ్లిన ఓ యువతి మిమ్మల్ని ముద్దు పెట్టుకోవచ్చా అంటూ కోరింది. దానికి షారుఖ్‌ సమాధానం చెప్పేలోపే సదురు యువతి బుగ్గపై ముద్దు పెట్టేసింది. తన అభిమాన హీరోకు ముద్దు పెట్టుకోవడాన్ని ఎంతో గ్రేట్‌గా ఫీల్‌ అయి సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. కానీ.. షారుఖ్‌ మాత్రం ఈ సంఘటనతో కాస్త ఇబ్బందిగా ఫీలయినట్లు వీడియోలో తెలుస్తోంది. ప్రస్తుతం యువతి షారుఖ్‌కు ముద్దు పెట్టిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు, అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆ యువతికి షారుఖ్‌ అంటే ఎంత అభిమానమో తెలుస్తోందంటున్నారు. ఆమె ఎంతో అదృష్టవంతురాలంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. మరికొందరు మాత్రం సరికాదంటూ చురకలంటిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఎవరైనా ఇబ్బందిగా ఫీలవుతారని అంటున్నారు. పఠాన్‌ హిట్‌ తర్వాత షారుఖ్‌ మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలోనే అవి కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.


Next Story