'యాత్ర 2' టీజర్ రిలీజ్‌.. మాములుగా లేదుగా

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జీవితంలోకి కొన్ని సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా 'యాత్ర - 2'. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

By అంజి  Published on  5 Jan 2024 12:17 PM IST
Yatra2 Movie, Yatra2 Teaser, Mammootty, Jiiva, Mahi V Raghav

'యాత్ర 2' టీజర్ రిలీజ్‌.. మాములుగా లేదుగా

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జీవితంలోకి కొన్ని సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా 'యాత్ర - 2'. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సినిమాకు మహీ వీ రాఘవ్ దర్శకుడు. వైఎస్ జగన్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తోన్నారు. ఇందులో కూడా వైఎస్సార్ క్యారెక్టర్ ఉంది. మమ్ముట్టే ఆ పాత్రను పోషిస్తోన్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది ఈ మూవీ. 2024 ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర 2 రిలీజ్ కాబోతోంది. కాగా 2019లో విడుదలైన 'యాత్ర' మూవీకి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ఆర్‌ పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర మూవీ అప్పట్లో రాజకీయంగా సంచలనం రేపింది.

తాజాగా వచ్చిన టీజర్‌తో సినిమాపై ఫుల్ క్లారిటీ రావడంతో పాటు, అంచనాలు సైతం భారీగా పెరిగిపోయాయి. 'చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్న.. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్న' అనే సీన్‌ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. తాజా టీజర్లో వైఎస్ జగన్, వైఎస్ భారతి, సోనియా గాంధీ క్యారెక్టర్లను పరిచయం చేశారు. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానె బెర్నెర్ట్, వై.ఎస్.భారతి పాత్రలో కేతకి నారాయణన్ నటించారు.


Next Story