యాత్ర-2 ట్రైలర్.. మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా..?

మరో పొలిటికల్ డ్రామా వచ్చే వారం థియేటర్లలో సందడి చేయనుంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా నటించిన

By Medi Samrat  Published on  3 Feb 2024 6:30 PM IST
యాత్ర-2 ట్రైలర్.. మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా..?

మరో పొలిటికల్ డ్రామా వచ్చే వారం థియేటర్లలో సందడి చేయనుంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా నటించిన యాత్ర సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యాత్ర-2 ఫిబ్రవరి 8న రానుంది. ఈ సినిమాలో తమిళ హీరో జీవా వైఎస్ జగన్ గా నటిస్తున్నారు. మహీ వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకుడు. యాత్ర-2 చిత్రం నుంచి ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వైఎస్సార్ మరణం, తదనంతర రాజకీయ పరిస్థితులు, జగన్ కాంగ్రెస్ ను వీడి కొత్త పార్టీ ఏర్పాటు చేయడం ఇందులో చూపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి ఎలాగైతే ఎదురు వెళ్ళారో, జైలు జీవితం, పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లడం తదితర అంశాలను ఈ ట్రైలర్ లో చూపించారు. సినిమాలో జగన్ పలికిన పలు డైలాగ్స్ ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థం అవుతూ ఉంది. యాత్ర-2 చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. వైసీపీ శ్రేణులు ఈ సినిమాను పబ్లిసిటీకి ఉపయోగించుకునే అవకాశాలు చాలానే ఉన్నాయి. ‘యాత్ర 2’ సినిమాలో వైయస్ జగన్, భారతి దంపతులుగా జీవా, కేతికా నారాయణ్ నటించారు. వైయస్సార్ పాత్రలో మరోసారి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయనున్నారు. త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి శివ మేక ‘యాత్ర 2’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Next Story