యాత్ర-2 సినిమా కోసం అంత ఖర్చు చేశారా?
మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన 'యాత్ర 2' సినిమా ఈ వారం విడుదల కాబోతోంది.
By Medi Samrat Published on 5 Feb 2024 6:00 PM ISTమహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన 'యాత్ర 2' సినిమా ఈ వారం విడుదల కాబోతోంది. యాత్ర మొదటి భాగం 2019లో రాగా.. ఆ సినిమా భారీ హిట్ గా నిలిచింది. ఇక సీక్వెల్ ఫిబ్రవరి 8 న విడుదల కానుంది. ఈ చిత్రం మీద సినీ అభిమానులే కాకుండా.. రాజకీయ నాయకుల దృష్టి కూడా ఉండనుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని, కాంగ్రెస్ హైకమాండ్ అభీష్టానికి వ్యతిరేకంగా ఆయన చేపట్టిన పాదయాత్ర గురించి సినిమాలో చూపించారు. ఇంకొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై వైఎస్సార్సీపీ అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు.
అయితే ఈ సినిమా బడ్జెట్ దాదాపు 50 కోట్లు అని చెబుతున్నారు. ఈ బడ్జెట్‌లో చాలా భాగం స్టార్ క్యాస్ట్ కోసమే ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 10 నిమిషాల 8 సెకన్లు. ఇక ఈ సినిమాకు వైసీపీ వర్గాల నుండి కూడా భారీ స్పందన ఉండడం మాత్రం ఖచ్చితమేనని చెప్పవచ్చు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా నటించిన యాత్ర సినిమా అప్పట్లో మంచి హిట్ గా నిలిచింది. ఇప్పుడు యాత్ర-2 లో తమిళ హీరో జీవా వైఎస్ జగన్ గా నటిస్తున్నారు. యాత్ర-2 చిత్రం నుంచి ట్రైలర్ కొద్దిరోజుల కిందటే రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.