ఇబ్బందుల్లో యష్ 'టాక్సిక్' మూవీ.. చెట్లను నరికినందుకు మేకర్స్‌పై కేసు
కన్నడ స్టార్ హీరో యష్ నటించిన 'టాక్సిక్' సినిమాపై అభిమానులు, సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
By అంజి Published on 13 Nov 2024 11:25 AM ISTఇబ్బందుల్లో యష్ 'టాక్సిక్' మూవీ.. చెట్లను నరికినందుకు మేకర్స్‌పై కేసు
కన్నడ స్టార్ హీరో యష్ నటించిన 'టాక్సిక్' సినిమాపై అభిమానులు, సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రాబోయే కొత్త సినిమాల్లో అత్యంత ఎక్కువ అంచనాలు ఉన్న సినిమాల్లో 'టాక్సిక్' ఒకటి. అయితే, చిత్రీకరణ కొనసాగుతుండగా, ఈ ప్రాజెక్ట్ చట్టపరమైన చిక్కుల్లో పడింది. కర్నాటక అటవీ శాఖ చెట్లను అక్రమంగా నరికినందుకు దాని ప్రొడ్యూసర్లపై కేసు నమోదు చేసింది.
ఏఎన్‌ఐ రిపోర్ట్ ప్రకారం.. బెంగళూరులో సినిమా సెట్స్ నిర్మించడానికి అటవీ భూమిలో చెట్లను చట్టవిరుద్ధంగా నరికినందుకు నిర్మాతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. అదనంగా, కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ (HMT) జనరల్ మేనేజర్‌పై కేసులు నమోదు చేయబడ్డాయి.
ఇటీవల కర్ణాటక పర్యావరణ మంత్రి ఈశ్వర్ ఖండ్రే.. యష్ నటించిన టాక్సిక్ చిత్రీకరణ సమయంలో పీణ్యలోని అటవీ భూమిలో వందలాది చెట్లను హిందుస్థాన్ మెషిన్ టూల్స్ (HMT) అక్రమంగా నరికివేసిందని ఆరోపించారు. హెచ్‌ఎంటీ పరిధిలోని అటవీప్రాంతంలో సినిమా చిత్రీకరణ కోసం వందలాది చెట్లను అక్రమంగా నరికివేయడం శాటిలైట్ చిత్రాలలో కనిపిస్తోందని ఖండ్రే అన్నారు.
చెట్ల నరికివేతకు బాధ్యులైన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
యష్ ప్రస్తుతం తన తదుపరి పెద్ద ప్రాజెక్ట్ టాక్సిక్ కోసం సన్నివేశాలను చిత్రీకరించడానికి ముంబైలో ఉన్నాడు. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఈ చిత్రంలో అతని సహ నటిగా కియరా అద్వానీ కనిపించనుంది. టాక్సిక్ చిత్రానికి గీతు మోహన్‌దాస్ రచన, దర్శకత్వం వహించారు. KVN ప్రొడక్షన్స్ మరియు మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం అసలు విడుదల తేదీ నుండి ఏప్రిల్ 2025కు వాయిదా పడింది.