ఓటీటీలోకి వచ్చేస్తున్న సమంత 'యశోద'
Yashoda OTT Streaming Date Locked.సమంత నటించిన చిత్రం 'యశోద'.
By తోట వంశీ కుమార్ Published on 6 Dec 2022 9:44 AM ISTటాలీవుడ్ టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమె నటించిన చిత్రం 'యశోద'. హరి-హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ఈ చిత్ర ఓటీటీ హక్కులను దక్కించుకుంది.
డిసెంబర్ 9 నుంచి అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో ఓటీటీలోకి రావాల్సి ఉంది. అయితే.. ఈ చిత్రంలో ఈవా అనే పేరు ఉపయోగించడంతో వివాదం నెలకొంది. ఎట్టకేలకు సమస్య పరిష్కారం కావడంతో ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాకాలు ప్రారంభించారు.
ఇదిలా ఉంటే.. సమంత ప్రధాన పాత్రలో నటించిన 'శాకుంతలం' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకుడు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రంతో పాటు విజయదేవరకొండతో కలిసి 'ఖుషీ' చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.