అయిదు నెలలు బెడ్ మీద నుండి లేవలేను.. విష ప్రచారాన్ని ఆపమంటున్న నటి

Yashika Anand gives health update throw social media.కొన్ని సినిమాల్లో నటించి, బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2021 1:45 PM GMT
అయిదు నెలలు బెడ్ మీద నుండి లేవలేను.. విష ప్రచారాన్ని ఆపమంటున్న నటి

కొన్ని సినిమాల్లో నటించి, బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న నటి యషికా ఆనంద్ కారుకు గత నెల 24న చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ లో ఆమె కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె స్నేహితురాలు హైదరాబాద్ కు చెందిన పావని మరణించగా, యషికాకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా శస్త్రచికిత్స చేశారు. ఈ యాక్సిడెంట్ గురించి తమిళ మీడియాలో ఎన్నో వార్తలు కథనాలు వచ్చాయి. తాజాగా ఆమె ఆసుపత్రి బెడ్ మీద ఉంటూ తన మీద జరుగుతున్న విష ప్రచారం గురించి చెప్పుకొచ్చింది.

తాను మరో ఐదు నెలలు లేవలేనని, నడవలేనని యషికా ఆనంద్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. తన తుంటి ఎముక, కుడి కాలు విరిగిందని శస్త్రచికిత్సలు పూర్తయ్యాయని తెలిపింది. మరో ఐదు నెలలు నేను లేవలేను. నడవలేను. అన్నీ బెడ్ మీదే.. చివరికి మలమూత్ర విసర్జనలూ బెడ్ మీదే..! ఎటూ తిరగలేకపోతున్నా.. అదృష్టం కొద్దీ నా ముఖానికి ఏమీ కాలేదు. ఓ రకంగా నాకు ఇది పునర్జన్మేనని తెలిపింది. మానసికంగా, శారీరకంగా నేను గాయపడ్డాను. దేవుడు నాకు సరైన శిక్షే వేసినా.. నేను పోగొట్టున్న దాని కన్నా ఎక్కువేమీ కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక తాను మద్యం తాగి కారు నడిపానన్న వార్తలు నిజం కాదని తెలిపింది. తాను ఒకవేళ తాగి ఉంటే.. కటకటాల వెనక ఉండేదాన్నని, ఆసుపత్రిలో కాదని తెలిపింది. కొందరు కల్తీ మనుషులు, నకిలీ వార్తలను ఎప్పటి నుంచో వ్యాపింపజేస్తున్నారని, ఇది చాలా సున్నితమైన విషయమని ఆమె తెలిపింది. రెండేళ్ల క్రితం పరువు నష్టం దావా వేసినా ఇలాంటి మనుషులు అసలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. చనిపోయిన అమ్మాయి కుటుంబంపై కొంచెమైనా మానవత్వం చూపించాలని ఆమె కోరింది. ఓ మంచి స్నేహితురాలిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉందని, తాను బతికున్నంత కాలం నేరం చేశానన్న భావన వెంటాడుతుందని ఆమె తెలిపింది.

Next Story
Share it