మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్న యష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Yash holidays in Maldives shares cute images with his family.కేజిఎఫ్ ఈ సినిమా ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యష్ ఫ్యామిలీ మాల్దీవులలో ఎంజాయ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jan 2021 9:23 AM GMT
Yash holidays in Maldives

'కేజిఎఫ్' సినిమా ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ రాకింగ్ స్టార్ యష్. తాజాగా ఆయ‌న‌ కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. భార్య రాధికా పండిట్ కూతురు ఐరా, కొడుకు య‌థ‌ర్వ్‌తో క‌లిసి మాల్దీవుల్లో య‌ష్ చేస్తున్న సంద‌డికి సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మొన్న‌టి వ‌ర‌కు కేజీఎఫ్ 2 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న య‌ష్.. ఇటీవ‌లే ఆ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశాడు.

2008 లో తన భార్య రాధిక పండిట్ సరసన "మోగ్గినా మనసు" చిత్రంతో కన్నడ సినీ రంగ ప్రవేశం చేసిన యష్ 2016వ సంవత్సరంలో రాధిక పండిట్ ను పెళ్లి చేసుకున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఒక వాణిజ్య ప్రకటనలో కూడా నటించారు. యష్ నటించిన కేజిఎఫ్ 2 సినిమా టీజర్ తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే కేవలం అతి కొద్ది సమయంలో కొన్ని కోట్ల వ్యూస్ సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచింది.

కేజిఎఫ్ 2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తొందరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేజిఎఫ్ సినిమా ఘన విజయం సాధించిన తరువాత యష్ తన ప్రతి ప్రాజెక్టుకు దాదాపు పదిహేను కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం యష్ మాల్దీవుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Next Story
Share it