ఎఫ్ 3 నుంచి 'ఊ .. ఆ .. అహ అహ' పాట వ‌చ్చేసింది.. విన్నారా..?

Woo Aaa Aha lyrical song from F3 movie out.విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ఎఫ్ 3.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 April 2022 5:54 AM GMT
ఎఫ్ 3 నుంచి ఊ .. ఆ .. అహ అహ పాట వ‌చ్చేసింది.. విన్నారా..?

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా, మెహ‌రీన్ కౌర్‌లు క‌థానాయిక‌లు. వేస‌వి కానుక‌గా ఈ చిత్రం మే 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈనేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు ప్రారంభించింది. ఈ చిత్రం నుంచి ఒక్కొ పాట‌ను విడుద‌ల చేస్తోంది. అందులో భాగంగా నేడు(శుక్ర‌వారం) 'ఊ .. ఆ .. అహ అహ' అంటూ సాగే రిలిక‌ల్ పాట‌ను విడుద‌ల చేసింది.

పాట ఆరంభంలో 'నీ కోర మీసం చూస్తుంటే.. నువ్వుట్టా తిప్పేస్తుంటే.. 'అంటూ లిరిక్స్ వినిపిస్తున్నాయి. మంచి రొమాంటిక్‌గా కనిపిస్తున్న ఈ పాటను వెంకటేష్-తమన్నా, వరుణ్ తేజ్ – మెహ్రీన్ జంటలపై చిత్రీకరించారు. ఈ పాట‌ను కాసర్ల శ్యామ్ రాయగా సునిధి చౌహాన్, లవితా లోబో, సాగర్, ఎస్పీ అభిషేక్ కలిసి ఆలపించారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందించాడు.

దిల్ రాజు స‌మ‌ర్పిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి, అన్న‌పూర్ణ‌మ్మ‌, ప్ర‌గ‌తి, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, అంజ‌లి, సునీల్ ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఎఫ్2 కు కొన‌సాగింపుగా వ‌స్తున్న ఈ చిత్రం.. ఆ సినిమాకి మించి వినోదాన్ని అందిస్తుంద‌ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో వెల్ల‌డించారు.

Next Story
Share it