20 వేల స్క్రీన్స్​లో ప్రభాస్ 'ఆదిపురుష్' విడుద‌ల‌..!

Will Prabhas Adipurush release across 20000 theatres in one go?.బాహుబ‌లి చిత్రం త‌రువాత ప్ర‌భాస్ క్రేజ్ మామూలుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jan 2022 8:20 AM GMT
20 వేల స్క్రీన్స్​లో ప్రభాస్ ఆదిపురుష్ విడుద‌ల‌..!

బాహుబ‌లి చిత్రం త‌రువాత ప్ర‌భాస్ క్రేజ్ మామూలుగా లేదు. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఆయ‌నకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ వ‌రుస బెట్టి సినిమాల‌ను చేస్తున్నాడు. ప్ర‌భాస్ న‌టించిన 'రాధే శ్యామ్' విడుద‌లకు సిద్దంగా ఉండ‌గా.. ప‌లు చిత్రాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. అందులో బాలీవుడ్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న 'ఆది పురుష్' చిత్రం ఒక‌టి.

భారీ బ‌డ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రాముడి పాత్ర‌లో ప్ర‌భాస్ క‌నిపించ‌నుండ‌గా.. బాలీవుడ్ న‌టి కృతి స‌న‌న్ సీత పాత్ర‌లో క‌నిపించ‌నుంది. బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ లంకేశుడిగా నటిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సాధ్య‌మైనంత తొంద‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు స‌న్నాహాకాలు చేస్తున్నారు. దాదాపు 15 భార‌తీయ బాష‌ల‌తో పాటు వివిధ దేవాల బాష‌ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 20,000 థియేట‌ర్లలో ఒకే సారి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. దీంతో నెటీజ‌న్లు 'ఆదిపురుష్‌' పాన్‌ ఇండియా సినిమా కాదు.. పాన్ వరల్డ్‌' సినిమా అని పిలుచుకుంటున్నారు.

Next Story
Share it