నరేష్-పవిత్రల 'మళ్లీ పెళ్లి' విడుదల అవ్వదా..?
సీనియర్ నటుడు నరేష్.. పవిత్రా లోకేష్ జంటగా నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించగా..
By M.S.R Published on 25 May 2023 8:30 PM ISTనరేష్-పవిత్రల 'మళ్లీ పెళ్లి' విడుదల అవ్వదా..?
సీనియర్ నటుడు నరేష్.. పవిత్రా లోకేష్ జంటగా నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించగా.. నటుడు వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా మే 26న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. మళ్లీ పెళ్లి సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నరేష్ భార్య రమ్య రఘుపతి మళ్లీ పెళ్లి సినిమా విడుదల ఆపాలని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు పిటిషన్ వేశారు. తన ప్రతిష్టను కించపరిచేలా సినిమా ఉందని ఆరోపించారు. నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన మళ్లీ పెళ్లి సినిమా రేపు విడుదల కానుండగా.. రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించడంతో సినిమా విడుదలపై సస్పెన్స్ మొదలైంది.
సీనియర్ నటుడు నరేశ్ పవిత్ర లోకేశ్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారు. దీనిపై మూడో భార్య రమ్య.. పవిత్ర, నరేశ్ ఉన్న హోటల్ గది వద్దకు వెళ్లి అక్కడ రచ్చ చేయడం, అది సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే..! వాటన్నిటినీ ఉంచి నరేశ్ హిరోగా పవిత్ర హిరోయిన్ గా మళ్లీ పెళ్లి అనే సినిమాను తీశారు. ఈ విషయం ట్రైలర్, టీజర్ చూస్తే అందరికీ అర్థం అవుతుంది. దీంతో రమ్య కోర్టును ఆశ్రయించారు. అది కూడా సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు తీర్పు ఎలా వస్తుందో చూడాలి.