వైల్డ్‌డాగ్ ట్రైల‌ర్ విడుద‌ల‌

Wild Dog Trailer out.కింగ్ నాగార్జున న‌టిస్తున్న తాజా చిత్రం వైల్డ్ డాగ్ చిత్ర ట్రైల‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి ట్విట్ట‌ర్‌లో విడుద‌ల చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 March 2021 4:33 PM IST
Wild Dog Trailer out

కింగ్ నాగార్జున న‌టిస్తున్న తాజా చిత్రం 'వైల్డ్ డాగ్'. అహిషోర్ సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ( NIA) ఏజెంట్ విజ‌య్ వ‌ర్మగా నాగార్జున న‌టిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్మమెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్ కుమార్ మాటలు అందిస్తోండ‌గా.. దియా మీర్జా కథానాయికగా నటిస్తోంది. సయామీ ఖేర్ మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి ట్విట్ట‌ర్‌లో విడుద‌ల చేశారు.

ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. నా సోదరుడు నాగ్ ఎప్పటిలాగానే కూల్ గా, ఎనర్జటిక్ గా కనిపిస్తున్నాడు అని కితాబిచ్చారు. ఏ జానర్ లో ప్రయత్నించేందుకైనా నాగ్ వెనుకాడడని ప్రశంసించారు. ఈ సినిమా విజయవంతం కావాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

హైద్రాబాద్ లో 2007లో జరిగిన గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ మరియు 2013 దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారులైన టెర్రరిస్టులను పట్టుకోడానికి రంగంలోకి దిగిన ఎన్ఐఏ టీమ్ కథే ఇదని ట్రైలర్ తో అర్థం అవుతోంది. టెర్రరిస్టులని పట్టుకోడానికి ఎన్ఐఏ టీమ్ ఎలాంటి సాహసాలు చేస్తారో తెలియజేయడానికి రిస్కీ లొకేషన్స్ లో షూట్ చేశారు. దీనికి థమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. షానెల్ డియో సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలిచాయి. మొత్తం మీద ఈ యాక్షన్ ప్యాకెడ్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఏప్రిల్ 2 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఓ లుక్కేయండి.


Next Story