క‌న్న‌డిగుల ఆగ్ర‌హం.. ట్విట్ట‌ర్‌లో 'బాయ్‌కాట్ ఆర్ఆర్ఆర్ ఇన్ క‌ర్ణాట‌క' ట్రెండ్‌

Why ‘Boycott RRR in Karnataka’ is Trending on Twitter.యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 March 2022 1:03 PM IST
క‌న్న‌డిగుల ఆగ్ర‌హం.. ట్విట్ట‌ర్‌లో బాయ్‌కాట్ ఆర్ఆర్ఆర్ ఇన్ క‌ర్ణాట‌క ట్రెండ్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లు ప్ర‌ధాన పాత్రల్లో న‌టించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం)'. ద‌ర్శ‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ ఆశ‌లే ఉన్నాయి. అజయ్ దేవ్ గన్, అలియా భట్, ఒలీవియా మోరిస్, సముద్రఖని, శ్రియ తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అన్ని అవాంత‌రాలు దాటుకుని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ నెల 25న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. దేశంలోని ప్ర‌ధాన ప్రాంతాలు అయిన బెంగుళూరు, హైదరాబాద్, దుబాయ్, బరోడా, ఢిల్లీ, జైపూర్, అమృత్‌సర్, కోల్‌కతా, వారణాసిలో చిత్ర‌బృందం ప‌ర్య‌టిస్తూ.. ప్ర‌మోష‌న్స్ చేప‌ట్టింది.

ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో #BoycottRRRinKarnataka ట్రెండ్ చేస్తున్నారు. తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లోనూ విడుద‌ల అవుతున్న ఈ చిత్రం కర్ణాట‌క‌లో కన్నడ భాషలో విడుద‌ల కాక‌పోవ‌డంపై ఆగ్ర‌హాం వ్య‌క్తం చేస్తున్నారు. క‌న్న‌డ బాష‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌క‌పోవ‌డం కన్నడిగులను అవమానించడమేనని నెటిజన్లు అంటున్నారు. చిత్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని ట్రోల్ చేస్తూ.. #BoycottRRRinKarnatakaని ట్రెండ్ చేస్తున్నారు. కన్నడ భాషలో అందుబాటులోకి తెస్తే తప్ప ఈ సినిమాను చూసేదే లేదంటూ శపథం పూనుతున్నారు. మ‌రీ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.




Next Story