ఈ వార‌మే ఖిలాడీ రిలీజ్‌.. మ‌రీ ప్ర‌మోష‌న్లు మాటేంటి..?

What is the issue between Khiladi team members.ఎవ‌రైనా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే వారం ప‌ది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Feb 2022 3:37 PM IST
ఈ వార‌మే ఖిలాడీ రిలీజ్‌.. మ‌రీ ప్ర‌మోష‌న్లు మాటేంటి..?

ఎవ‌రైనా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే వారం ప‌ది రోజుల ముందు నుంచే సినిమా ప్ర‌మోష‌న్ల‌తో హోరెత్తిస్తుంటారు. సినిమా విజ‌యం సాధించాలంటే ప్ర‌మోష‌న్స్ చాలా ముఖ్యం అన్న సంగ‌తి తెలిసిందే. అందుక‌నే రాజ‌మౌళి వంటి స‌క్సెస్ పుల్ ద‌ర్శ‌కుడు కూడా ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతుంటాడు. అయితే.. ర‌వితేజ త‌న కొత్త విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌ప్ప‌టికీ కూడా ప్ర‌మోషన్స్‌కు దూరంగా ఉన్నాడు.

'క్రాక్' సినిమాతో మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ మ‌ళ్లీ పుల్ జోష్‌లోకి వ‌చ్చాడు. తాజాగా ఆయ‌న న‌టించిన చిత్రం 'ఖిలాడి'. రమేష్ వర్మ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా న‌టించారు. పెన్ స్టూడియోస్ మరియు ఏ స్టూడియోస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు మరియు రమేష్ వర్మలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ఫిబ్ర‌వ‌రి 11న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

విడుద‌ల‌కు మ‌రో మూడు రోజులు మాత్ర‌మే ఉన్న‌ప్ప‌టికీ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఎలాంటి హడావుడి లేదు. సోష‌ల్ మీడియాలో ప్ర‌మోష‌న్ చేస్తున్నా.. ప్రీ రిలీజ్‌, ఇంట‌ర్వ్యూలు వంటివి లేవు. రవితేజ ప్రస్తుతం వ‌రుస సినిమాల షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే.. మిగతా యూనిట్ దర్శక, నిర్మాతలైనా ప్రమోషన్లు చేయాల్సి ఉన్నా వాళ్ళు కూడా సైలెంట్ గానే ఉన్నారు. దీంతో మాస్ మ‌హారాజా అభిమానులు అయోమయంలో ఉన్నారు. ఇక ట్రైల‌ర్ చూస్తుంటే మాత్రం ర‌వితేజ ఖాతాలో మ‌రో హిట్ ప‌డిన‌ట్లేన‌ని అభిమానులు అంటున్నారు. ఇక ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీలోనూ విడుద‌ల అవుతోంది.

Next Story