పూన‌కాలు తెప్పిస్తున్న వాల్తేరు వీర‌య్య టైటిల్ సాంగ్‌

Waltair Veerayya Title Song Released.మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం 'వాల్తేరు వీర‌య్య‌'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Dec 2022 10:38 AM IST
పూన‌కాలు తెప్పిస్తున్న వాల్తేరు వీర‌య్య టైటిల్ సాంగ్‌

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం 'వాల్తేరు వీర‌య్య'‌. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చిరు స‌ర‌స‌న శ్రుతి హాస‌న్ న‌టిస్తోంది. మాస్ మ‌హా రాజా ర‌వితేజ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ చిత్రం. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్యక్ర‌మాల్లో వేగాన్ని పెంచింది.



ఇప్ప‌టికే ఈ చిత్రం విడుద‌లైన టీజ‌ర్‌, రెండు పాట‌లు అభిమానుల‌ను అల‌రించ‌గా తాజాగా మూడో పాట‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. ఈ టైటిల్ సాంగ్‌ను సైతం అద‌ర‌గొట్టాడు దేవీ శ్రీ ప్ర‌సాద్. 'భగ భగ భగ మండే.. మగ మగ మగాడురా వీడే.. జగ జగ జగాన్ని చెండాడే.. ధగ ధగ జ్వలించు సూరీడే.. అగాధ గాథల అనంత లోతుల.. సముద్ర సోదరుడే వీడే.. వినాశ కారుల స్మశానమౌతాడే.. తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడంటే అది వీడే.. తలల్ని తీసే విశిష్టుడే వీడే' అంటూ ఈ పాట సాగుతోంది. చంద్ర‌బోస్ సాహిత్యాన్ని అందించ‌గా అనురాగ్ కులకర్ణి, పవిత్ర చారి పాడారు. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

Next Story