ప్రెస్‌మీట్‌లో బిగ్‌బాస్ విన్నర్ సన్నీకి కరెంట్ షాక్
VJ Sunny got current shock during press meet.బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 విజేతగా సన్నీ గెలిచిన సంగతి తెలిసిందే.
By తోట వంశీ కుమార్ Published on 22 Dec 2021 12:09 PM ISTబిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 విజేతగా సన్నీ గెలిచిన సంగతి తెలిసిందే. తనదైన ఆట తీరుతో మెప్పించిన సన్నీ.. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో శ్రీరామ్, సిరి, మానస్, షన్ముఖ్ దాటుకుని టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ట్రోఫీ గెలిచి బయటకి వచ్చినప్పటి నుంచి పలు ఇంటర్య్వూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు. అయితే.. నిన్న హైదరాబాద్ జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో అపశృతి చోటుచేసుకుంది.
ఈ ప్రెస్‌మీట్‌లో పలు మీడియా చానెల్స్‌తో పాటు యూట్యూబ్ ఛానెల్స్ కూడా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సన్నీ సమాధానం చెప్పాడు. ఈ క్రమంలో మొబైలోని ఓ క్లిప్పింగ్‌ను చూపించేందుకు సన్నీ ఫోన్ పట్టుకున్నాడు. అది సిస్టమ్‌కి కనెక్ట్ అయ్యి ఉండడంతో కొద్దిగా షాక్ కొట్టింది. దీంతో వెంటనే సన్నీ తన చేతిని వెనక్కి లాక్కున్నాడు. పెద్దగా ఎటువంటి గాయం కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధింన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సన్నీ జాగ్రత్త అంటూ కామెంట్లు పెడుతున్నారు.
సన్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి. 1989 ఆగష్టు 17న ఖమ్మంలో జన్మించాడు. స్కూల్, ఇంటర్ ను ఖమ్మం నగరంలోనే పూర్తి చేశాడు. అనంతరం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి ఉండడంతో.. ఓ ఛానెల్‌లో 'జస్ట్ ఫర్ మెన్' అనే టీవీ షోకి యాంకర్‌గా పనిచేసే అవకాశం రావడంతో తనదైన శైలిలో రాణించాడు. ఆ తరువాత ఓ న్యూస్ ఛానల్‌లో రిపోర్టర్‌గా పనిచేశాడు. అనంతరం 'కళ్యాణ వైభోగం' అనే సీరియల్‌లో జయసూర్య అనే క్యారెక్టర్‌లో సన్నీ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అనంతరం బిగ్‌బాస్‌లో గెలిచి అశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు. సన్నీ హీరోగా నటించిన 'సకలగుణాభిరామ' సినిమా త్వరలోనే విడుదల కానుంది.