ఎట్టకేలకు డేటింగ్ విషయం బయటపెట్టిన యూట్యూబ్ స్టార్..!

Viva harsha love story. యూట్యూబ్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వైవా హర్ష.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jan 2021 7:23 AM GMT
Viva Harsha

యూట్యూబ్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వైవా హర్ష.. కామెడీ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా హర్ష నటించిన కలర్ ఫుల్ ఫోటో చిత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో బాల యేసుగా నటించిన హర్ష తన నటన ద్వారా అందరి మన్ననలను పొందాడు. అయితే ప్రస్తుతం హర్ష మెగా డాటర్ సుస్మిత దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా హర్ష త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా తాను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న హర్ష నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

హర్ష నిశ్చితార్థానికి సాయి ధరమ్ తేజ్, వైష్ణవి దేశ్ మెగా డాటర్ సుస్మిత హాజరయ్యారు. ఈ నిశ్చితార్థంలో భాగంగానే హర్ష గత రెండేళ్ల నుంచి ఒక అమ్మాయితో డేటింగ్ లో ఉన్న విషయం బయట పెట్టారు. మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన అక్షరతో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారిందని అక్షరతో తనకున్న అనుబంధం గురించి ఈ సందర్భంగా వైవా హర్ష తెలియజేశారు.

గత నాలుగు సంవత్సరాల నుంచి తనతో పరిచయం ఏర్పడిందని, రెండేళ్ల క్రితం తనను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అందుకు అక్షర ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. గత రెండు సంవత్సరాల నుంచి వీరిద్దరు డైటింగ్ లో ఉన్న విషయాన్ని స్వయంగా హర్ష తెలియజేశారు. అయితే ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలియడంతో పెళ్లికి ఒప్పుకున్నారు. వీరి పెళ్లి జూన్ నెలలో ఉండవచ్చని ఈ సందర్భంగా వైవా హర్ష తెలియజేశారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Next Story
Share it