నా పేరు ప్రేమ్‌.. నేను 1600 మంది అమ్మాయిల్ని ప్రేమించాను

Viswal sen Paagal trailer out.‘ఫలక్‌నుమాదాస్‌’, ‘హిట్‌’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న న‌టుడు విశ్వ‌క్ సేన్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Aug 2021 7:29 AM GMT
నా పేరు ప్రేమ్‌.. నేను 1600 మంది అమ్మాయిల్ని ప్రేమించాను

'ఫలక్‌నుమాదాస్‌', 'హిట్‌' చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న న‌టుడు విశ్వ‌క్ సేన్‌. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం 'పాగ‌ల్‌'. న‌రేశ్ కొప్పిలి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో విశ్వ‌క్ స‌ర‌స‌న నివేదా పేతురాజ్ న‌టిస్తోంది. ఈ చిత్రం ఆగ‌స్టు 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేసింది. ఇటీవ‌ల 'గూగులు గూగులు గూగులు.. గర్ల్‌ఫ్రెండ్‌ని వెతికే గూగులు.. వీడు పాగలు పాగలు పాగలు.. ప్రేమ కోసం వెతికే పాగలు' అంటూ సాగే లిరికల్‌ పాట విడుద‌ల చేయగా తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ ను విడుద‌ల చేసింది.

'నా పేరు ప్రేమ్‌.. నేను 1600 మంది అమ్మాయిల్ని ప్రేమించాను' అని విశ్వ‌క్ సేన్ చెప్పే డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. ఇది సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తుంది. విశ్వక్ సేన్ లుక్ కూడా ఆక‌ట్టుకునేలా ఉంది. ఏ అమ్మాయికి పడితే ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ సిల్లీ లవర్ బాయ్ లా మంచి ఫన్ ని కూడా పుట్టించాడు. నివేతా పెథురాజ్ మంచి ఎమోషన్స్ పండించింది. ట్రైల‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈచిత్రంలో ఈనగరానికి ఏమైంది ఫేమ్ సిమ్రాన్ చౌదరి కూడా కనిపిస్తుంది.

రాహుల్ రామ‌కృష్ణ‌, మ‌హేశ్ ఆచంట క‌డుపుబ్బా న‌వ్వించారు. ఈ చిత్రాన్ని దిల్‌రాజ్ స‌మ‌ర్ప‌ణ‌లో బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. ర‌ధ‌న్ ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడు. మ‌రీ ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఓసారి ట్రైల‌ర్‌ను చూసేయండి.


Next Story
Share it