విశ్వక్ సేన్ 'పాగల్' టీజర్ విడుదల
Viswak Sen Paagal teaser released. విశ్వక్ సేన్ 'పాగల్' టీజర్ విడుదల
By తోట వంశీ కుమార్ Published on 18 Feb 2021 11:44 AM ISTటాలీవుడ్‌లో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పేరు తెచ్చుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. విశ్వక్ తనదైన నటనతో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. 'ఫలక్‌నుమా దాస్', 'హిట్' సినిమాలతో తెలుగు ప్రేక్షకులని అలరించిన విశ్వక్ సేన్ తాజాగా 'పాగల్' చిత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. నరేష్ కుప్పిల్లి దర్శకత్వంలో తెరకెక్కుతన్న ఈ చిత్ర టీజర్‌ను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. ఇందులో విశ్వక్ సేన్ చాలా రొమాంటిక్‌గాను, ఆవేశంగాను కనిపిస్తున్నాడు. టీజర్ మాత్రం ఫ్యాన్స్‌కు మంచి ఫీస్ట్ అందిస్తుందనే చెప్పాలి.
'రేయ్.. ఎవడ్రా నా లవర్ ని ఏడిపించింది?' అని విశ్వక్ సేన్ ఓ గ్యాంగ్ ని ప్రశ్నించడంతో ఈ టీజర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత కనిపించిన ప్రతి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తూ వచ్చిన హీరో.. చివరకు ఒక బామ్మకు కూడా ప్రపోజ్ చేసి 'పాగల్' నేపథ్యాన్ని తెలియజేశాడు. 'నా లవర్ ఫేస్ లో హ్యాపీనెస్ కనిపించడం లేదురా.. స్ట్రాంగ్ గా కొట్టండి.. స్ట్రాంగ్ గా.. వైల్డ్ గా.. నా లవ్ లా' అంటూ విశ్వక్ సేన్ చెప్పే డైలాగ్ బాగా పేలింది. మ్యాజికల్ లవ్ స్టోరీగా పాగల్ మూవీ రూపొందుతుండగా.. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రామజోగయ్య శాస్త్రి, కెకె కిట్టు విస్సా ప్రగడ లిరిక్స్ అందిస్తున్నారు. ఏప్రిల్ 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.