షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ మంచు విష్ణు.. కాలికి గాయం.. అత‌డే కార‌ణం అంటూ పోస్ట్

Vishnu Manchu injured badly on Ginna sets.టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు షూటింగ్‌లో గాయ‌ప‌డ్డారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Sep 2022 10:38 AM GMT
షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ మంచు విష్ణు.. కాలికి గాయం.. అత‌డే కార‌ణం అంటూ పోస్ట్

టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు షూటింగ్‌లో గాయ‌ప‌డ్డారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌నే తెలియ‌జేశారు. గాయానికి సంబంధించిన ఫోటోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తాను గాయ‌ప‌డ‌డానికి కొరియోగ్రాఫ‌ర్ ప్రేమ్ ర‌క్షిత్ మాస్ట‌ర్ అని చెప్పుకొచ్చాడు.

జ‌య‌ప‌జయాల‌తో సంబంధం లేకుండా వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు మంచువారి అబ్బాయి విష్ణు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రం 'జిన్నా'. ఇషాన్‌ సూర్య దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం బాష‌ల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ లు క‌థానాయిక‌లు న‌టిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అక్టోబ‌ర్ 5న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


ఇప్ప‌టికే మెజార్టీ భాగం చిత్రీక‌ర‌ణ పూర్తి కాగా.. ఓ పాట మిగిలి ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్రేమ్ ర‌క్షిత్ మాస్ట‌ర్ ఈ పాట‌కు కొరియోగ్రఫి చేస్తున్నారు. అయితే.. డ్యాన్స్ చేస్తుండ‌గా విష్ణు కాలికి గాయ‌మైంది. గాయానికి సంబంధించిన ఫోటోను విష్ణు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దీనికి కార‌ణం ప్రేమ్ ర‌క్షిత్ మాస్ట‌ర్ అని రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్‌గా మారింది. కాగా.. విష్ణు ఆసుపత్రికి వెళ్లారా? లేక ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? అన్న విష‌యాన్ని మాత్రం చెప్ప‌లేదు.

Next Story