ఉప్పెన హీరో రెండో మూవీ టైటిల్ ఫిక్స్‌

Vishnav Tej New movie first look released.తొలి చిత్రం ఉప్పెన‌తో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అందుకున్నాడు హీరో వైష్ణ‌వ్ తేజ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Aug 2021 5:46 AM GMT
ఉప్పెన హీరో రెండో మూవీ టైటిల్ ఫిక్స్‌

తొలి చిత్రం 'ఉప్పెన‌'తో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అందుకున్నాడు హీరో వైష్ణ‌వ్ తేజ్‌. మెగా మేన‌ల్లుడిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టినా.. త‌న‌కంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది. ఫ‌స్ట్ ప్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విభిన్న క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈచిత్రానికి కొండ‌పొలం అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విష‌యాన్ని చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది. అందుకు సంబంధించి మోష‌న్ పోస్ట‌ర్‌, ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసింది.

'కొండపొలం'అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న కారణంగా ఈ సినిమాకి అదే టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన నవలా హక్కులను కొని అదే కథతో సినిమా చేసాడు క్రిష్. అడవి జంతువులూ తిరిగే చోట నీరు కూడా దొరకని పరిస్థితుల్లో రైతు జీవనం ఎలా సాగింది అన్న కథతో ఈ చిత్రం రానున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే చిత్ర షూటింగ్ పూర్తి కాగా.. అక్టోబ‌ర్ 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story