షూటింగ్‌లో గాయ‌ప‌డిన హీరో విశాల్‌.. చికిత్స కోసం కేర‌ళ‌కు ప‌య‌నం

Vishal suffers multiple fractures while shooting for Laththi.హీరో విశాల్ గాయ‌ప‌డ్డాడు. ప్ర‌స్తుతం ఆయ‌న లాఠీ అనే చిత్రంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Feb 2022 2:20 AM GMT
షూటింగ్‌లో గాయ‌ప‌డిన హీరో విశాల్‌.. చికిత్స కోసం కేర‌ళ‌కు ప‌య‌నం

హీరో విశాల్ గాయ‌ప‌డ్డాడు. ప్ర‌స్తుతం ఆయ‌న 'లాఠీ' అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ ఫైట్ స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తుండ‌గా ఆయ‌న‌కు గాయాల‌య్యాయి. ఈ విష‌యాన్ని విశాల్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. 'లాఠీ చిత్ర స్టంట్ సీక్వెన్స్ చేస్తుంటే గాయాల‌య్యాయి. విశాంత్రి, చికిత్స కోసం కేర‌ళ వెలుతున్నా. మార్చి తొలివారంలో ఈ చిత్ర త‌దుప‌రి షెడ్యూల్‌లో పాల్గొంటా'న‌ని విశాల్ ట్వీట్ చేశాడు.

ఈ చిత్రంలో ఆయ‌న ఓ పోలీస్ అధికారిగా న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఓ బాలుడి ర‌క్షించే స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తుండ‌గా ఈ ఘ‌టన జ‌రిగింది. చిన్నారిని పట్టుకుని కిందికి దూకే యత్నంలో విశాల్ చేతి ఎముకకు గాయమైంది. ఎ.వినోద్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో విశాల్ స‌ర‌స‌న సున‌య‌న న‌టిస్తోంది. సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్న ఈచిత్రాన్ని ర‌మ‌ణ‌, నంద నిర్మిస్తున్నారు.

Next Story
Share it