ఫుల్ పవర్ ప్యాక్డ్‌గా విశాల్ 'లాఠీ' టీజర్‌

Vishal Laththi movie teaser release. విశాల్‌ నటించిన తాజా చిత్రం 'లాఠీ'. ఈ సినిమాను హైవోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కిస్తు

By అంజి  Published on  25 July 2022 12:09 PM IST
ఫుల్ పవర్ ప్యాక్డ్‌గా విశాల్ లాఠీ టీజర్‌

తమిళ్ హీరో విశాల్‌ హిట్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్‌ చేస్తున్నాడు. లేటెస్ట్‌ విశాల్‌ మరో ఆసక్తికర మూవీతో ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. విశాల్‌ తన కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి.. విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. విశాల్‌ నటించిన తాజా చిత్రం 'లాఠీ'. ఈ సినిమాను హైవోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. వినోద్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో విశాల్‌ సరసన హీరోయిన్‌ సునైనా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్‌ చేశాయి.

సెప్టెంబర్‌ 15న 'లాఠీ' సినిమా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఇక టీజర్‌ చూస్తుంటే గుస్‌బంప్స్‌ వస్తున్నాయి. ''రేయ్.. తప్పు చేసి తలదాచుకునే పోకిరివి.. నీకే ఇంత పొగరున్నప్పుడు.. ఆ తప్పుని నిలదీసే పోలీసోడ్ని… నాకు ఎంత పొగరుంటుంది'' అంటూ విశాల్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పీటర్ హెయిన్ డిజైన్ చేసిన స్టంట్స్ టీజర్‌లో హైలెట్ గా నిలిచాయి. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి అన్ని భాషలకు ఒకే టైటిల్‌ పెట్టారు.


Next Story