మేజర్ : 'వినవే హృదయమా' లిరిక‌ల్ సాంగ్‌

Vinave Hridayama Lyrical Song out.యువ హీరో అడ‌వి శేష్ న‌టిస్తున్న తాజా చిత్రం మేజ‌ర్‌. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Jan 2022 7:33 AM GMT
మేజర్ : వినవే హృదయమా లిరిక‌ల్ సాంగ్‌

యువ హీరో అడ‌వి శేష్ న‌టిస్తున్న తాజా చిత్రం 'మేజ‌ర్‌'. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి శ‌శి కిర‌ణ్ తిక్క ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో అడ‌వి శేష్ స‌ర‌స‌న సాయీ మంజ్రేకర్ న‌టిస్తోంది. తెలుగుతో పాటుగా హిందీ మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ ఫిబ్ర‌వ‌రి 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

'వినవే హృదయమా' అనే పాట‌ను సూప‌ర్ స్టార్ మ‌హేష్ చేతులు మీదుగా విడుద‌ల చేశారు. సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట‌ను పాడారు. ఈ రొమాంటిక్ సాంగ్‌కు కృష్ణ కాంత్, విఎన్వి రమేష్ కుమార్ లిరిక్స్ అందించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిచారు. శోబితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని జీఎమ్‌బీ ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సంస్థతో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోంది.

Next Story
Share it