విల‌న్ ఆఫ్ పుష్ప‌.. లుక్ అదిరిపోయింది

Villain of Pushpa Bhanwar Singh Shekhawat poster out.సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో పుష్ప

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Aug 2021 5:15 AM GMT
విల‌న్ ఆఫ్ పుష్ప‌.. లుక్ అదిరిపోయింది

సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'పుష్ప' సినిమా ఒక‌టి. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. మ‌ల‌యాళ విల‌క్షణ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ ఇందులో విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. ఇక ఈ చిత్రం నుంచి క్ర‌మం త‌ప్ప‌కుండా అప్‌డేట్‌లు ఇస్తూ అంచ‌నాలు పెంచేస్తున్నారు. తాజాగా ఫహద్ ఫాజిల్ ఫస్ట్ లుక్ ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది.

ఇందులో ఆయ‌న భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ అనే ఓ పోలీస్ అధికారి పాత్ర‌లో న‌ట‌టిస్తున్నారు. పోస్టర్ లో ఫహద్ గుండుతో సీరియస్ గా క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఎర్రచంద‌నం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్ని స‌ర‌స‌న ర‌ష్మిక మందాన న‌టిస్తోంది. మైత్రిమూవీ మేక‌ర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. పుష్ప: ది రైజ్-పార్ట్ 1 ను క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story