'విక్ర‌మ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. అభిమానుల‌కు పండ‌గే

Vikram Movie OTT release date announced.లోక‌నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్ లోకేష్ కనరాజ్ దర్శకత్వంలో న‌టించిన చిత్రం విక్ర‌మ్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jun 2022 9:41 AM GMT
విక్ర‌మ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. అభిమానుల‌కు పండ‌గే

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్ లోకేష్ కనరాజ్ దర్శకత్వంలో న‌టించిన చిత్రం 'విక్ర‌మ్‌'. జూన్ 3న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.400 కోట్లు రాబ‌ట్టింది. యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర ఓటీటీ విడుద‌ల తేదీని లాక్ చేశారు. ప్ర‌ముఖ ఓటీటీ డీస్నీ+హాట్‌స్టార్‌లో జులై 8 నుంచి విక్ర‌మ్ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ డీస్నీ+హాట్‌స్టార్ ఓ స్పెష‌ల్ వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోలో క‌మ‌ల్ హాస‌న్ మాట్లాడుతూ..'మ‌న‌కు న‌చ్చిన చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా చాల్లేదు క‌దూ. ప‌దండి చూసుకుందాం. డీస్నీ+హాట్‌స్టార్‌లో 'అని అంటూ విక్రమ్ స్టైల్ లో గన్ చూపిస్తూ క‌మ‌ల్ హాస‌న్ ఆవీడియోలో చెప్పాడు. హిందీ, తెలుగు, తమిళ, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌ భాషల్లో విక్రమ్ అందుబాటులోకి రానుంది.

ఈ చిత్రంలో విజ‌య్‌సేతుప‌తి, ఫ‌హ‌ద్ ఫాజిల్ కీల‌క పాత్ర‌లు పోషించారు. న‌టుడు సూర్య రోలెక్స్‌గా అతిథి పాత్ర‌లో అదర‌గొట్టేశాడ‌ని చెప్ప‌వ‌చ్చు.

Next Story
Share it