అమెరికాలో ఆర్ఆర్ఆర్ హక్కులు వారికే.. రాజమౌళి తండ్రికి కరోనా

Vijayendra prasad tests Covid-19 positiveఅమెరికాలో 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ హక్కులను సరిగమ సినిమాస్, రఫ్తార్ క్రియేషన్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు చేజిక్కించుకున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2021 7:02 PM IST
Vijayendra prasad tests Covid-

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్. సినిమా హక్కులను హాట్ కేకుల్లా కొంటూ ఉన్నారు. ఇప్పటికే శాటిలైట్ రైట్స్, ఓటీటీ, థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తాన్ని చెల్లించి మరీ కొన్నారు. అమెరికాలో 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ హక్కులను సరిగమ సినిమాస్, రఫ్తార్ క్రియేషన్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు చేజిక్కించుకున్నాయి. అమెరికాలో అక్టోబరు 12న ప్రీమియర్ షోలు ఉంటాయని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ఓ ప్రకటనలో తెలిపింది.

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'ఆర్ఆర్ఆర్' పలు భాషల్లో విడుదల కాబోతోంది. తమిళనాడులో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ ను లైకా ప్రొడక్షన్స్ దక్కించుకోగా, ఉత్తరాది రాష్ట్రాల్లో పెన్ స్టూడియోస్ దక్కించుకుంది. 'ఆర్ఆర్ఆర్' చిత్రం రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రం అక్టోబరు 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

ఇలా ఉండగా రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్ కరోనా బారినపడ్డారు. ఆయనకు కొవిడ్ పాజిటివ్ అని తేలడంతో ఐసోలేషన్ లోకి వెళ్లారు. తనను కలిసినవాళ్లందరూ కరోనా టెస్టులు చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజయేంద్రప్రసాద్ తెలిపారు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.




Next Story